Archive for the ‘భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత... ఓ భూమాత’ Category

శుభప్రదం: ఓరిమి చాలమ్మా ఓ భూమాత!

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Shubha Pradam
Song Singers
   Rita
Music Director
   Mani Sharma
Year Released
   2010
Actors
   Allari Naresh,
   Manjari Phadnis
Director
   K Vishwanath
Producer
   Harigopala Krishna Murthy,
   PN Thilak

Context

Song Context:
    మెదడుకు చెద బట్టిన ఉన్మాదం ఏ బడి నేర్పినదీ చెడు పాఠం!
    ఏం చేస్తున్నది యువత ఏం చూస్తున్నది మానవత!
(To the youth taking others life/everything, in the name of love - Sirivennela’s judgement!)

Song Lyrics

||ప|| |ఆమె!
       ఓ భూమాతా! ||2||
       ఓరిమి చాలమ్మా ఓ భూమాత! ||2||
       భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత.. ఓ భూమాత!!
       ఓరిమి చాలమ్మా ఓ భూమాత!
       భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత.. ఓ భూమాత!!
       మనిషిని మహర్షిగా మలచే మహితాశయ విద్యాలయం
       మధించి తిరిగే మహిషాసురలుకు నిలయమైతే అది విలయం
       భద్రకాళిగా నిద్రలేవగా క్షుద్రుల కేళిని ఛిద్రము చేయగ
       ధనుజమర్దని గా తాండవించగా తరుణమిదే గనుక
                           ||ఓరిమి చాలమ్మా||
.
చరణం: ఆమె:
       ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని మొదలైనది పసితనము
       ఏ విషమ క్షణంలో పశుగణమైనది యవ్వనం వికృత క్రీడల వింత వినోదం
       రక్కసి కేకల రణం నినాదం ||2||
       మెదడుకు చెద బట్టిన ఉన్మాదం ఏ బడి నేర్పినదీ చెడు పాఠం
       ఏం చేస్తున్నది యువత ఏం చూస్తున్నది మానవత ||2||
                            ||ఓరిమి||
.
చరణం: ఆమె:
       కన్నది తామేనా ఈ కౌరవ సంతతినీ
       తమ పెంపకమేనా ఈ అరాచకత్వమనీ
       సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రీ
       ప్రశ్నించని గాంధారి ఐతే ప్రతి తల్లీ
       ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని
       ఎవ్వరు ఆపాలి కిర్రెక్కిన కుర్రతనాన్ని
       ఏం రాస్తున్నదీ చరిత!
       ఏం కానున్నది మన భవిత!
.
.
                          (Contributed by Nagarjuna)

Highlights

    మనిషిని మహర్షిగా మలచే మహితాశయ విద్యాలయం
    మధించి తిరిగే మహిషాసురలుకు నిలయమైతే అది విలయం
    భద్రకాళిగా నిద్రలేవగా క్షుద్రుల కేళిని ఛిద్రము చేయగ
    ధనుజమర్దని గా తాండవించగా తరుణమిదే గనుక
    భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత.. ఓ భూమాత!
.
    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని మొదలైనది పసితనము
    ఏ విషమ క్షణంలో పశుగణమైనది యవ్వనం వికృత క్రీడల వింత వినోదం
.
    ఏం రాస్తున్నదీ చరిత!
    ఏం కానున్నది మన భవిత!
………………………………………………………………………………………………..