|
Context
Song Context:
వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ వినుడీ మన సారా!
(A hilarious (un)convincing story) |
Song Lyrics
||ప|| |అతడు|
చీపుగ చూడకు పొరపాటు చిరాకు పడదా సిగరెట్టు
మహమ్మారి అని తిట్టద్దు మహిమ తెలుసుకుని జై కొట్టు
తెలియకపోతే చెబుతాగానీ తప్పని మాత్రం అనవద్దు
.
వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ వినుడీ మన సారా
వింటే మీకు జ్ఞానోదయమై దమ్ము లాగకుంటారా?
చుట్టా బీడీ తంబాకు అన్నీ చుట్టాలే తనకు
అనాది నుంచి ఆచారంగా వస్తూ ఉంది అలవాటు
గరీబు నుంచి నవాబు దాక అంతా సమానమే అంటూ
పేదా పెద్దా భేదాలెరగని అసలు సిసలు కమ్యూనిస్టు… ఈ సిగరెట్టు…
హే హే సుమా…కొంప తీసి టైగర్ ఇస్ దేర్ ఇన్ ద హౌస్?
|ఆమె| నో..హీజ్ గాన్ టు ద టెంపుల్
|అతడు| వినుడు వినుడు ఈ సిగరెట్ గాథ
.
||చ||
ప్రాణమిత్రుడూ పరమశత్రువూ తనకన్నా ఎవరంటూ
ప్రియురాలైనా తన తరువాతే అంటుంది ఈ సిగరెట్టు
ఆరోగ్యానికి హానికరం అని ముఖాన లేబుల్ కట్టు
అయినా గాని డోంట్ కేర్ అనే ధైర్యానికిది తుది మెట్టు
.
ఒరెయ్ నానీ..నీకో విషయం తెలుసా
ఎకానమీ కి నికోటినేరా ఆయువు పట్టు
నిమిషం పాటు నిషేధించినా కంట్రీ బడ్జెట్ ఫట్టు
ఊపిరి పీల్చే హక్కుంటే పొగ పీల్చే హక్కూ ఉన్నట్టే
దమ్ము కొట్టమని బోధించే ఆ దమ్మారే దం సూపర్ హిట్టే
పొగ తాగని తాగని తాగని వాడు దున్నపోతై పుట్టు
ఇది తెలిసిన తెలిసిన రామరాజుకి లోకం జై కొట్టు
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »