|
Context
Song Context:
Sister-in-law & sister with other family members making fun of the guy who has fallen in love!
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఏమైంది సారూ ఏంటా హుషారు
బాగుంది జోరు ఊరంత హోరు ||ఏమైంది సారూ||
|అతడు|
ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింతే లేదే నమ్మరూ
||ఏమైంది సారూ||
.
||చ|| |ఆమె|
చాల్లే జతులు చెడిపోవా మతులు
ఇలాంటి కుప్పిగంతులు వేస్తార చెప్పు నీలాంటి బుద్ధిమంతులు
|అతడు|
ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడూ
తీరిగ్గ చెమ్మచెక్కలు ఆడేదెలాగో చెప్పండే అమ్మలక్కలు
|ఆమె|
చూశాంలే ఎంత భారం నువు మోసే రాచకార్యం
చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం
|ఖోరస్| సససై సైర సైర
||ఏమైంది సారూ||
.
||చ|| |ఆమె|
వేసే అడుగు ఎటువైపో అడుగూ
ఏ నింగి చుక్కవరకు తోలిందిలాగ నీ కొంటె గాలి పరుగు
|అతడు|
తీసే పరుగు బిడియపడి ఆగేవరకు
పెళ్లీడు ఆడపిల్లకు ఉండాలి గాని మా లాంటి వాళ్లకెందుకు
|ఆమె|
అబ్బాయి నీ బడాయి ఆకాశం తాకెనోయి
మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి
|ఖోరస్| సససై సైర సైర
||ఏమైంది సారూ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »