Archive for the ‘నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా!’ Category

ఏప్రియల్ 1 విడుదల: నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా

Audio Song:
 
Movie Name
   April 1 Vidudala
Song Singers
   Mano
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Rajendra Prasad,
   Shobhana
Director
   Vamsi
Producer
   P.V. Bhaskara Reddy

Context

Song Context:
A compulsory liar is challenged by his lover to speak only the blunt truth until April 1, to win her!
That puts him in troubles… - నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా!

Song Lyrics

||ప|| |అతడు|
       నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా
       దరికొస్తే ముప్పే కాదా.. తప్పుకోండి తగుదూరం అంతా ||నిజమంటే నిప్పేకాదా ||
       నియమాలే దాటలేను.. నిజమేది దాచలేను నికరంగా నిష్టూరంగా డప్పు కొట్టి చెప్పిపోతా || 2 ||
                            ||నిజమంటే నిప్పే కాదా ||
.
||చ|| |అతడు|
       నమస్తే ముసలి మన్మధా.. క్షమిస్తే హితవు చెప్పెదా
       నరాల్లో పసరు చచ్చినా బుసలు తగ్గలేదా
       కులాసా దీనబంధువా… చరిత్రే చదవమందువా
       ఒలిస్తే మేడిపండువే పైకి ఒప్పుకోవా
       దివాకర నామధేయము.. నిజాలే నాకు ధ్యేయము
       ప్రమాదము కలదు ఖాయము… పరిస్థితి బహు బలీయము
       ఒప్పైనా తప్పైనా ముప్పైనా తప్పేనా…
       కయ్యాలు వస్తాయి అంటారా…ఏం చెయ్యను..తగువు సహజం
       నిజమంటే నిప్పే కాదా ముట్టుకుంటే చుట్టుకోదా మంటా
       దరికొస్తే ముప్పే కాదా.. తప్పుకోండి తగు దూరం అంతా
                              ||నిజమంటే నిప్పే కాదా ||
.
||చ|| |అతడు|
       నిజంగా ఒక్కటే నిజం.. రహస్యం తెలిసెనీ క్షణం
       ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే
       అసత్యం సహజ సుందరం… అనంతం దాని వైభవం
       అబద్ధం కరిగిపోయినా బ్రతుకు సాగదంతే
       ప్రతీది పచ్చి బూటకం… నిజం ఒక నిత్య నాటకం
       మనస్సొక పాడు కీటకం.. ఇదేరా అసలు కీలకం…
       వ్యాపారం.. వ్యవహారం.. సంసారం.. శృంగారం..
       అంగట్లో ముంగిట్లో.. అన్నిట్లో అసత్యమే ఇనుప కవచం
                             ||నిజమంటే నిప్పే కాదా||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..