|
Context
Song Context:
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా!
ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా!
కష్టమొస్తె కేరు చెయ్యక నవ్వుతో తరివేయవమ్మా!
|
Song Lyrics
||ప|| |అతడు|
సరేలే ఊరుకో పరేషానెందుకో
చలేసే ఊరిలో జనాలె ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా
ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం జోకర్ మేరా కాం నౌకర్
ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు
ఎనీథింగ్ కోరుకో క్షణాల్లో హాజరు
ఖరీదేం లేదు కాని - ఊరికేలే ఊపు రాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈల వేస్తే చూపుతాలే నా నమూనా
.
చరణం: అతడు:
పిల్లి పిల్లదెపుడు ఒకే మాటగద
పాప:
మియామియాం మియా మియామియాం మియా
అతడు:
కోడిపిల్లదెపుడు ఒకే కూత కద
పాప:
కొక్కొ కొక్కొరకో! కొక్కొ కొక్కొరకో
అతడు:
కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెపుడు మారనీయకే ఏమైనా
కష్టమొస్తె కేరు చెయ్యక నవ్వుతో తరివేయవమ్మా!
||మేరా నాం జోకర్||
.
చరణం: అతడు:
గూటి బిళ్ళ ఆడుదాం సిక్సర్లు కొడదాం
పాప:
క్రికెట్ కాదు గాని ఫన్నీగానే ఉంది
అతడు:
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
పాప:
బఫెల్లోస్ కది - బాత్రూం కాదా మరి
అతడు:
రాణిగారి ఫోజులో నువు కూర్చోమా ఠీవిగా
గేదెగారి వీపు మీద షైరుకెళదాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టుప్లేస్ ఈ పల్లెటూరే బుల్లెమ్మా!
బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడమ్మా!
||మేరా నాం జోకర్||
.
.
(Contributed by Pradeep) |
Highlights
………………………………………………………………………………………………..
|
1 Comment »