|
Context
Song Context:
తలొంచని మనసుంటే చాలు నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు
ఇట్టే నిజమై నీ ఒళ్ళో వాలు కళ్ళలో కలలు
.
తద్ధినక అనదా ఘల్లుమని ఈ గోల, నిద్దరిక చెడదా రాతిరికి ఈ వేళ!
|
Song Lyrics
||ప| విశాఖ:
చంచమక్ చం రంగుల్లో, ఝనకఝనక తారంగంలో ధంధమాకా రేగె రంగంలో
హాయ్ రే హాయ్ హంగామా జాయ్ రే జాయ్ అందామా
హరి:
చంచమక్ చం రంగుల్లో, ఝనకఝనక తారంగంలో ధంధమాకా రేగె రంగంలో
హాయ్ రే హాయ్ హంగామా జాయ్ రే జాయ్ అందామా
స్రవంతి:
ఈ సయ్యాటల్లో సంతోషం స్వరాలు పాడేలా
ఈ సరదాలోపడి భూగోళం కధక్కులాడేలా
విశాఖ:
ఈ కుర్రతనంలో కిర్రెక్కి కవ్వింతలతో కైపెక్కి
స్రవంతి:
అరె ఆకాశంలో వైకుంఠం అరచేతిలోకి దిగివచ్చేలా
కోరస్:
తద్ధినక అనదా ఘల్లుమని ఈ గోల, నిద్దరిక చెడదా రాతిరికి ఈ వేళ
|| చంచమక్ చం||
.
చరణం 1: విశాఖ:
తెలియకపోతేపోనీ ముందే మలుపున్నాగానీ
వదలకు ఈ నిమిషాన్ని అందాన్ని ఆనందాన్ని
స్రవంతి:
కాలం ఆగదుగా నీ జర్నీ జాలిగా పోనీ
వెనక్కి వెళ్ళే వీలే లేదని వర్రీ ఎందుకని
విశాఖ:
ఇవ్వాళే చూడాలా జానీ రేపు జరగనున్న హాని
హరి:
ఇపుడా సందేహాలన్నీ మాని సందడే కానీ
కోరస్:
తద్ధినక అనదా ఘల్లుమని ఈ గోల, నిద్దరిక చెడదా రాతిరికి ఈ వేళ
|| చంచమక్ చం||
.
చరణం 1: స్రవంతి:
ఎవరడ్డున్నా ఆగని స్పీడుంది మన పరుగుల్లో
హరి:
ఎవరెస్టైనా కరిగించే వేడుంది మన నాడుల్లో
విశాఖ:
ఆపలేదు ఏ వెదరూ నిన్ను దూసుకుపోతుంటే
హరి:
ఆపదకైనా బెదురు నువ్వు ఎదురైరమ్మంటే
స్రవంతి:
తలొంచని మనసుంటే చాలు నిన్ను నువ్వు నమ్ముకుంటే చాలు
ఇట్టే నిజమై నీ ఒళ్ళో వాలు కళ్ళలో కలలు
కోరస్:
తద్ధినక అనదా ఘల్లుమని ఈ గోల, నిద్దరిక చెడదా రాతిరికి ఈ వేళ
|| చంచమక్ చం||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »