|  | Context Song Context:మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా!
 | 
| Song Lyrics ||ప||ఆమె|మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో
 మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా
 అతడు:
 చినుకుతడి స్పృశించే లీలలా
 చిలిపి చలి సృజించే జ్వాలలా
 మధుమురళి రమించే గాలిలా
 మొదటి విరి సుమించే వేళలా
 మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో
 మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా
 .
 చరణం: అతడు:
 కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే
 ఆమె:
 ఎదురుగ ఉంటే నా మదిలోన కుదురుండదే
 అతడు:
 చూస్తూనే ఉండాలి నిను కనుమూసి ఉన్నా
 ఆమె:
 రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా
 అతడు:
 నిదరేదో నిజమేదో తేలీతేలని లాలనలో
 ఆమె:
 మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా
 ||చినుకు||
 .
 చరణం: ఆమె:
 ప్రతి నడిరాత్రి సూర్యుడు రాడా నీ శ్వాసతో
 అతడు:
 జతపడగానే చంద్రుడు కాడా నీ సేవతో
 ఆమె:
 ఆవిర్లు చిమ్మింది చూడు పొగమంచు పాపం
 అతడు:
 వేడెక్కే చల్లారుతుంది కలిపే క్షణం
 ఆమె:
 పగలేదో రేయేదో తెలిసీతెలియని లాహిరిలో
 అతడు:
 మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా
 ||చినుకు||
 .
 .
 (Contributed by Prabha)
 | 
| Highlights [Also refer to Page 215 in సిరివెన్నెల తరంగాలు]………………………………………………………………………………………………..
 | 
					
				 
				  No Comments »