Posted by admin on 1st October 2010 in
నవ్వు
|
Context
Song Context:
నవ్వు! |
Song Lyrics
||ప|| |అతడు|
నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు || నవ్వులో ||
నవ్వులాటకైనా వాడనీకు నవ్వు
నవ్వు తోడు నీకుంటే ఓడిపోవు నువ్వు
నవ్వులాంటి మందేది లేనే లేదంటూ
నాతో మళ్లి మళ్లి చెప్పింది నవ్వే నువ్వు పువ్వే
నువ్వై నవ్వే పువ్వై నువ్వు నవ్వు || నవ్వులో ||
నవ్వులో పుట్టాను…నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
.
||చ|| |అతడు|
కుకుకుకుకు… కోకిల నవ్వు… |ఖోరస్| కుకుకుకుకు
|అతడు|
గలగలగలగల తరగల నవ్వు
చిగురాకులు నవ్వు.. చిరుగాలులు నవ్వు.. || 2 ||
నవ్వుతూ నువ్వుంటే ఆ చుక్కలు
ఈ దిక్కులు ఎంచక్కా నీతో నవ్వు నువ్వు నవ్వు || నవ్వులో ||
|అతడు| నవ్వులో |ఆమె| పుట్టాను…
|అతడు| నవ్వులో |ఆమె| పెరిగాను
|అతడు| నవ్వుతూ |ఆమె| ఉన్నాను
|అతడు| నువ్వు |ఆమె| నవ్వు
.
||చ|| |అతడు|
ఇది ఓటరు ముందు చేతులు కట్టే నేతల వంకర నవ్వు… హి..హీ.. నమస్కారం
ఇది పదవి దక్కితే పరాకు ఫోజుల పాలిటిక్స్ నవ్వు అ అ..ఆ.. ఎవరూ..
ఇది స్టారు తిరిగి స్టారైపోయిన ఎక్స్ట్రా గారి నవ్వు హాఇ..హహహా.. యా
ఇది ఏజి ముదిరినా రాజీపడని పాతపార నవ్వు ఉండండి అబ్బా..
ఇది బాసు గారు జోకేస్తే బాసు గారి నవ్వు… హయ్యో..అబ్బో..
ఇది ఊసుపోకపోతే ఉత్తి సోడా గ్యాసు నవ్వు అహ్హ…
ఇది చక్కిలిగింతలే సరిగమలయ్యే సంగీతం నవ్వు.
హ…హ…హ……
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
1 Comment »