|
Context
Song Context:
మహరాజునని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే!
|
Song Lyrics
పల్లవి: |ఆమె|
ఎకి మీడా!… ఎకి మీడా! నా జత విడనని వరమిడవా!
తగు జోడా! నా కడ కొంగున ముడి పడవా!
.
|అతడు|
సుకుమారీ నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకునీ
మహరాజునని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే! ఎటెళ్తానే!
.
చరణం 1: |అతడు|
కడవై వుంటా నడువొంపుల్లో కులికే నడకా నను కాసుకో గుట్టుగా
||ఆమె||
కోకా రైకా నువ్వనుకుంటా చక్కెర తునకా చలి కాసుకో వెచ్చగా
.
||అతడు||
చెమట చలవో చిరు చినుకు చొరవో ఈ
తళ తళ తళ తళ తరుణి తనువు కిది ఎండో వానో
||ఆమె||
ఎండో వానో ఎవరికెరుక ఏ వేళాపాళా ఎరుగనని
ప్రతి రోజిలా నీతో బాటే నడుస్తు గడిస్తె ఎన్నాళ్ళైతేనేం ఎటైతేనేం
.
|అతడు| ఎకి మీడే! నీ జత విడనని వరమిడనే!
|ఆమె| వరమిడవా?
|అతడు| సరి జోడే! నీ కడ కొంగున ముడి పడనే!
.
చరణం 1: |ఆడ ఖోరస్|
వీరి వీరి గుమ్మడంటు వీది వాడ సుట్టుకుంటు
ఇంతలేసి కళ్ళ తోటి వింతలెన్నో గిల్లు కుంటు
ఉల్లోల మువ్వాల ఇయ్యాల సయ్యాటలు! సుర్రో!
.
|మగ ఖోరస్|
కోడె గాడు పక్కనుంటే ఆడ ఈడు ఫక్కు మంటె
మన్ను మిన్ను సూడనట్టూ మేలమాడుకుంటు ఉంటే
మత్తెక్కి తూగాల మున్నూరు ముప్పొద్దులు! సుర్రో!
.
||ఆమె|| ఎకి మీడా…. |
|
Highlights
ఎకి మీడా = ప్రభువు, పతి
……………………………………………………………………………………………….. |
No Comments »