|
Context
Song Context:
One side love - a perversion!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ పొదువుకోనీక వదులుకోనీక
ఇంతలా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా
||ఎందుకు ఎందుకు||
.
||చ|| |అతడు|
పాల నవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా ||2||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్లను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటకాని జంటలా నా వెంట నడవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా
||ఎందుకు ఎందుకు ||
.
||చ|| |అతడు|
నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా ||2||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాలా
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »