Movie Name Konchem Ishtam Konchem Kashtam Singers Shreya Ghoshal, Sonu Nigam Music Director Shankar-Ehsaan-Loy Year Released 2009 Actors Siddharth, Tamanna Director Kishore Kumar Producer
Nallamalapu Srinivas (Bujji)
Context
Song Context: Romantic song between a boy and a girl in love once they feel thier love is getting close to successful
Song Lyrics
||ప|| |అతడు|
అంతా సిద్ధంగ ఉన్నది మనసెంతో సంతొష మన్నది
ఆలస్య మెందుకన్నదీ… ఇలా రామ్మరి
|ఆమె|
అబ్బాయిగారి పద్దతి హద్దు మీరేట్టు గాని ఉన్నది
అల్లాడి పోద చిన్నదీ… చాల్లే అల్లరి
|అతడు|
కధలో తదుపరి పిలిచే పదమరి
|ఆమె|
మనువే కుదిరే
|అతడు|
మురిపెం ముదిరీ
|ఇద్దరు|
మనకిష్టమైన కష్టమైన ఊగిపొదమరి
|అతడు|
అంతా సిద్ధంగ ఉన్నది
|ఆమె|
హద్దు మీరేట్టు గాని ఉన్నది
|అతడు|
ఆలస్య మెందుకన్నదీ…
|ఆమె|
సరేలే మరీ….
|అతడు|
పయట పడి ఎదిగిన వయసా
|ఆమె|
ఓయ్ ఏంటి కొత్త వరసా
|అతడు|
బయట పడ కూడదు సొగసా
|ఆమె|
పోవోయ్… చాల్లెండి అసాధ్యం
|అతడు|
ఓ… పయట పడి ఎదిగిన వయసా
బయట పడ కూడదు సొగసా… తెలుసా…
మండి పోద వళ్ళు పరాయి వాళ్ళ కళ్ళు
నిన్నంత లాగ చూస్తె అలా
|ఆమె|
ఎందు కంట కుళ్ళు నువ్వైన ఇన్ని నాళ్ళు
నువ్వైన ఇన్ని నాళ్ళు నన్ను కొరకలేదు అచ్చం అలా
|అతడు|
కనుకే కలిశాం బంధమై బిగిశాం
నీకు ఇష్టమైన కష్టమైన వదలనంది అది
|ఆమె|
అబ్బాయిగారి పద్దతి హద్దు మీరేట్టు గాని ఉన్నది
|అతడు|
ఆలస్య మెందుకన్నదీ… ఇలా రామ్మరి
|అతడు|
చెంపలకు చెప్పవె సరిగా సిగ్గుపడమని ఒక సలహా
ఓ.. చెంపలకు చెప్పవె సరిగా సిగ్గుపడమని ఒక సలహా
చెలియా కన్నెపిల్ల బుగ్గా కాస్తైనా కంది పోక పసి పాప లాగ ఉంటే అలా
|ఆమె|
ముందరుంది ఇంకా… ముద్దు ముచ్చటంత ఇక
కంగారు పెట్టకే అప్పుడే ఇలా
|అతడు|
ఉరికే సరదా చెబితే వింటదా
నీకు ఇష్టమైన కష్టమైన ఒప్పుకోదు అది
||ప|| |అతడు|
అంతా సిద్ధంగ ఉన్నది మనసెంతో సంతొష మన్నది
ఆలస్య మెందుకన్నదీ… ఇలా రామ్మరి
Highlights
The logic is “కనుకే కలిశాం బంధమై బిగిశాం”
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world