Archive for March, 2009

యమలీల: సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు

Posted by admin on 27th March 2009 in జోలపాట

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Yamaleela
Singers
   Chitra, S.P. Balu
Music Director
   S.V Krishna Reddy
Year Released
   1994
Actors
   Manju Bhargavi, Ali
Director
   S.V Krishna Reddy
Producer
   K. Achchi reddy

Context

Song Context:
 తల్లి జోలపాట రెండు సందర్భాల్లో: బిడ్డకి చిన్నప్పుడు మరియు కొడుకు పెద్దప్పుడు

Song Lyrics

||ప|| |తల్లి|
       సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
       చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
       బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
       చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
       ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
       ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
       మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
                        || సిరులొలికించే చిన్ని || |తల్లి|
.
||ఖోరస్||
       జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ… మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ…
.
||చ|| |తల్లి|
       నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
       లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
       మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
       ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
       కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
       నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ
                       || సిరులొలికించే చిన్ని || |తల్లి|
.
||చ|| |కొడుకు|
       వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
       నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
       నాలో అణువు అణువు ఆలయంగా మారగా
       నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
       తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
       కీడన్నదే కనిపించేనా ఎన్నడైన
                       || సిరులొలికించే చిన్ని || | తల్లి |
.
.
                                  (Contributed by Nagarjuna)

Highlights

One of the attributes of Sirivennela’s poetry is the logical closure (two way relationship):
1) From mom’s perspectvie
      “కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
       నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ”
.
2) From son’s perspective
     “నాలో అణువు అణువు ఆలయంగా మారగా,
                      నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
      తోడుండగా నను దీవించే కన్న ప్రేమ,
                      కీడన్నదే కనిపించేనా ఎన్నడైన”
.
.
Observe Sirivennela’s propensity of “సామెతలని తిరగేయడం” which I am going to call the “vice-versa” concept. For eg. “ఈడన్నదే కనిపించేనా ఎన్నడైన”. It is typically attributed to mom’s perspective but Sirivennela is saying it is also true from son’s perspective!
.
Otherwise just enjoy the song!
………………………………………………………………………………………………..