Movie Name Indra Singers K.K., Mahalakshmi Music Director Mani Sharma Year Released 2002 Actors Chiranjeevi, Sonali Bendre Director B. Gopal Producer C. Ashwani Dutt
Context
Song Context: Romantic Song
Song Lyrics
||ప||
|అతడు| దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా
|ఆమె| దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మా
నీపై మనసైందమ్మా నా నిండు చందమామా
.
|ఖోరస్| ఓహో… |అతడు| ఒళ్ళో వాలుమా
|ఖోరస్| ఓహో… |ఆమె| వయసే ఏలుమా
.
|అతడు| నిలువెల్ల విరబూసే నవయవ్వనాల కొమ్మా
|ఆమె| తొలిజల్లై తడిమేసే సరసాల కొంటె తనమా ||దాయి||
.
|అతడు| టకటక మంటూ తలపును తట్టి తికమక పెట్టే
లకుముకి పిట్టా నిను వదిలితే ఎట్టా
|ఆమె| నిలబడమంటూ నడుమును పట్టి కితకిత పెట్టే
మగసిరి పట్టా కథ ముదిరితె ఎట్టా
|అతడు| కేరింతలాడుతు తప్పించలేదా కాదంటె ఇపుడు తప్పేదెలా
|ఖోరస్| అది కాదంటె ఇపుడు తప్పేదెలా
|ఆమె| నీకౌగిలింతకు జాలంటు లేదా ఏం దుడుకు బాబోయ్ ఆపేదెలా
|ఖోరస్| అయ్యొ ఏం దుడుకు బాబోయ్ ఆపేదెలా
.
|ఖోరస్| ఓహో ఓ… |అతడు| కోరిందే కదా
|ఖోరస్| ఓహో ఓ… |ఆమె| మరీ ఇంతిదా
.
|అతడు| మరి కొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా
|ఆమె| వ్యవహారం శ్రుతిమిస్తే సుకుమారి బెదిరిపోదా
|అతడు| హాయి హాయి హాయి అరెరే పైట జారి పొయే
పాప గమించవే మా కొంప మునిగి పోయె
.
|ఖోరస్| కాలిన్ మిస్టర్ డీ జే
|అతడు| ఎస్ బాయ్ తెస్కో టిప్ కార్ గిరోంగి తిస్కో
.
|అతడు| పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగులు పరువా
సొగసుల దరువా ఓ.. తుంటరి మగువా
|ఆమె| నునుపులు ఇట్టా ఎదురుగ పెట్టా
ఎగబడలేవా నాకు జతకావా నావరసై పోవా
|అతడు| అల్లాడి పోకే పిల్లా మరి ఆ కల్యాణ ఘడియా రానీయవా
|ఖోరస్| ఆ కల్యాణ ఘడియా రానీయవా
|ఆమె| అరె అందాక ఆగదు ఈ అల్లరి
నీ హితబోధలాపి శ్రుతిమించవా
|ఖోరస్| నీ హితబోధలాపి శ్రుతిమించవా
.
|ఖోరస్| ఓహో ఓ… |అతడు| వాటం వారెవా
|ఖోరస్| ఓహో ఓ… |ఆమె| ఒళ్ళో వాలవా
.
|అతడు| అనుమానం కలిగింది నువు ఆడపిల్ల వేనా
|ఆమె| సందేహం లేదయ్యో నీ పడుచు బదులు పైనా
||దాయి దాయి (అతడు) ||
.
|ఆమె| హేహేహే హాయి హాయి హాయి కొరికే కళ్ళూ చేరిపోయె
ఐన అది కూడ ఏదో కొత్త కొంటె హాయి
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world