Posted by admin on 24th April 2009 in
అమ్మ
|
Song (1) Lyrics
Context: అమ్మ
.
.
||ప|| |బిడ్డ|
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
||ఎవరు||
.
||చ||
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు ||2||
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
||ఎవరు||
.
||చ||
శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది
ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది ||2||
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
||ఎవరు||
.
.
(Contributed by Prabha) |
Song (2) Lyrics
Context: అమ్మ
.
.
||చ|| |అతడు|
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది ||2||
.
రొమ్మేగా… రొమ్మేగా అందించెను జీవితాన్ని నొటికీ
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగంలా తీయని రాగం |
Song (3) Lyrics
Context: అమ్మ
.
.
||ప|| |అతడు|
ఆలైన బిడ్డలైనా ఒకరు పోతె ఇంకొకరు
అమ్మ పదవి ఖాళీ అయినా అమ్మ అవరు ఇంకెవరు ||2||
.
అమ్మంటే… అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగని ఈ నౌకరి
.
ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగంలా తీయని రాగం
………………………………………………………………………………………………. |
Highlights (1, 2 & 3)
Sweetest poetry!
.
“ప్రాణమనే పాటకి అమ్మేగా ఆదిస్వరం!”
.
“అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని” [Recursion]
.
మన category listలో తొలి పదం కుడా “అమ్మ”
.
Finally ఎవరు రాయగలరూ “అమ్మ” పాటని ఇంత మధురంగా - మన సిరివెన్నెల గారొక్కరు తప్ప!
……………………………………………………………………………………………….
[Also refer to Page 245 in సిరివెన్నెల తరంగాలు] |
|
4 Comments »