Movie Name
Anandamaaye Singers SriRam Prabhu Music Director
Koti Year Released 2004 Actors
Akash, J.D. Chakravarthy
Renuka Menon Director Srinu Vaitla Producer Ramoji Rao
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
మేలుకునే కలలుకన్నానా
కోరుకునే కబురువిన్నానా
నేడే నాకు తొలి ఉదయం అనుకోనా
కనబడని తీరమే ఎదుట నిలిచిందా
మనసుపడు స్నేహమే నన్ను పిలిచిందా ||మేలుకునే కలలు||
.
||చ|| |అతడు|
నా చుట్టూ అల్లుకున్నది అందంగా
ఎన్నెన్నో వరసల సావాసం
నా సొంతమౌతానన్నది నిజంగా
ఇన్నాళ్ళు దొరకని సంతోషం
మొదటిసారిగా ఏకాంతం పెదవి కదిపిన రాగంలో
పలుకుతున్నది ఈ గీతం
కనబడని తీరమే ఎదుట నిలిచిందా
మనసుపడు స్నేహమే నన్ను పిలిచిందా ||మేలుకునే కలలు||
.
||చ|| |అతడు|
ఇన్నిన్ని రంగులున్నవా లోకంలో
ఏనాడూ చూడలేదే నా కళ్ళు
నాలోనే దాగి ఉన్నవా ఏమూలో
జాడైనలేని ఇన్ని సందళ్ళు
అదుపు తెలియని ఆనందం ఎదను తరిమిన వేగంలో
నిలవనన్నది నా పాదం
కనబడని తీరమే ఎదుట నిలిచిందా
మనసుపడు స్నేహమే నన్ను పిలిచిందా ||మేలుకునే కలలు||
.
.
(Contributed by Prabha)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world