Movie Name
Keka Singers Hema Chandra, Kousalya Music Director
Chakri Year Released 2008 Actors
Raja, Ishana Director Teja Producer Teja
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |ఆమె|
అడిగావా మాటైనా
వదిలావా జాడైనా ||2||
ఇపుడైనా నా మనసు
మగవాడా నీకే తెలుసు
|అతడు|
తెలిసేలా ఏదైనా
పలికావా ఎపుడైనా
నీదేనా నా మనసు
నిజమెదో నీకూ తెలుసు
|ఆమె|
ఎలా ఎలా నువ్వు చేరావో నా వరకూ…
|అతడు|
నువ్వే కదా నడిపించావు ప్రతి అడుగూ
|ఆమె|
ఆగవే ఓ చిరునవ్వా…
దాగలేనంటున్నావా
అలక తెర దాటిస్తావా..
కిలకిలా పైకొస్తావా… || తెలిసేలా || |అతడు|
.
||చ|| |ఆమె|
అన్నం కూడా తినక
కనురెప్పైనా పడక
ఉన్నానింకా నువ్వెళ్లిపోయాక
|అతడు|
అన్యాయంగా అనమాక
వదిలానా ఒంటరిగా
నీ తలపుల్లో నిత్యం ఉన్నాగా
|ఆమె|
నీ వ్యాపకాలు ఎన్నున్నా
నా జ్ఞాపకాలు కొన్నైనా
నీకపుడపుడైనా ఎదురై వచ్చేనా
|అతడు|
తన గుండెల సడినెవరైనా
గుర్తిస్తారా ఎపుడైనా
నువు మరుపొచ్చావా తలవాలనుకున్నా
|ఆమె|
కాదను నా కంటిలో నువ్వు నలుసైనా
నను ఇంకే వైపు చూణ్ణీకా..
|అతడు|
జోరీగై నీ చెవిలో కొలువైపోనా
వేరెవ్వరి పేరూ విన్నీకా
|ఆమె|
తుమ్మెదై కాటేస్తున్నా
కమ్మగా ఉందనుకోనా
|అతడు|
సంకెలై కట్టేస్తున్నా
చక్కగా బందీ కానా ||అడిగావా|| |ఆమె|
.
||చ|| |అతడు|
మళ్లీ కలిసేదాకా ఆశే మాత్రం లేక
గాల్లో తిరిగా దారేం తెలీక
|ఆమె|
సందేహం ఏం లేక
ఉందే అనుకున్నాగా
నేడో రేపో తప్పదు నీ రాక
|అతడు|
నీ ప్రేమెంతటిదో తెలిసీ
నా ప్రేమకు రాదా జేలౌస్య్
ఆ నమ్మకమేదీ తనకని సిగ్గేసి
|ఆమె|
నీ సర్వం నాకిచ్చేసి
నను గర్వించేలా చేసి
మన చెలిమిని అలుసుగ చూడకు దయ చేసి
|అతడు|
కాస్తైనా కలతలా తడిపడనీయకుండా
గొడుగవనా నీ నీడక్కూడా
|ఆమె|
దాస్తాగా నా మది చాటున జన్మంతా
నువ్వైనా నీక్కనపడకుండా
|అతడు|
చేర్చుకో నీ చెరలోన
పారిపోనే నెరజాణా
|ఆమె|
ఎప్పుడూ సరదాకైనా
తప్పుకోకే ఇటు పైనా || అడిగావా || |ఆమె|
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world