|
Context
Song Context:
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
పూలతీగై ఊగే లేతసైగేలాగే |
Song Lyrics
||ప|| |ఆమె|
ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
|అతడు|
పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
|ఆమె| ||ఊహలేవోరేగే ||
|అతడు| ||హాయి కథ||
.
||చ|| |ఆమె|
ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగ నిగ నీడేగా
|అతడు|
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా
|ఆమె|
కోరివస్తా కాదు అనుకోకా
|ఆమె| ||ఊహలేవోరేగే ||
|అతడు| ||హాయి కథ||
.
||చ|| |అతడు|
ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
|ఆమె|
గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలము అడుగుతూ చెరిసగమైపోవా
|అతడు|
ఒకరి కొకరం పంచుకుందాం రా
|అతడు| ||పూలతీగై||
|ఆమె| ||ఊహలేవోరేగే ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
No Comments »