|
Context
Song Context:
నువ్వు నిజం నీ నవ్వు నిజం, నా కంటి కాంతినడుగు!
నేను నిజం నా ప్రేమ నిజం, ఇది పిచ్చితనం అనకు!
|
Song Lyrics
||ప|| |అతడు|
నువ్వు నిజం నీ నవ్వు నిజం
నా కంటి కాంతినడుగు
వేరే వెన్నెలుంది అనదు
ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం
ఇది పిచ్చితనం అనకు
అన్నా మనసు మాట వినదు
విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా
.
||చ|||ఆమె|
ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు, వెంటే పడవ అష్ట దిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులో
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా
.
||చ|||ఆమె|
ఎప్పటికీ నను తప్పుకునే వీలివ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు
కట్టా చూడు వలపు వలలు
|అతడు|
దుప్పటిలా నను కప్పినవే నలనల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
|ఆమె|
మనసే దోస్తే ఎలా…
|అతడు|
కనకే ఈ సంకెల
|ఆమె|
ఒడిలో పడితే ఇలా..అడుగే కదిలేదెలా
|ఇద్దరు|
నువ్వూ నేనూ రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే అయినా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోగా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Follow the complete lyrics!
……………………………………………………………………………………………….. |
1 Comment »