Archive for 2010

నీకే మనసిచ్చాను: అందీ అందక తుళ్లే అందమా

Audio Song:
 
Movie Name  
   Neeke Manasichanu
Song Singers
   Devisri Prasad,
   Sumangali
Music Director
   Sri
Year Released
   2003
Actors
   Srikanth,
   Charmee,
   Anitha
Director
   Surya Teja
Producer
   M.S. Kumar
   Koduri Ramamoorthy

Context

Song Context: 
    ఏమో ఏమి ప్రేమో పోల్చనీవా బొత్తిగా!

Song Lyrics

||ప|| |అతడు|
       అందీ అందక తుళ్లే అందమా
ఆమె:
       అన్నీ పొందగ అల్లే ఆత్రమా
అతడు:
       ఎంత ఓర్చుకున్నా - ఇంత కన్నా సాధ్యమా
ఆమె:
       ముందే పోల్చుకున్నా తొంగి చూసే నేత్రమా
                               ||అందీ అందక||
.
చరణం: అతడు:
       దేవీ ఎన్నాళ్లు ఈ విన్నపాలు మౌనం చాలమ్మా
ఆమె:
       వేవేలసార్లు విన్నాను చాలు లాభం లేదమ్మా
అతడు:
       సంకెళ్లే తెగవా సరదాలే కరువా
ఆమె:
       కవ్వించే తగువా చాల్లే నీ చొరవా
అతడు:
       దూరం తరగనీమ్మా చేరువైతే పాపమా
ఆమె:
       మారం మానుకోమ్మా తాళలేవా తాపమా
                              ||అందీ అందక||
.
చరణం: అతడు:
       నిన్నే వరించి నీకై తపించి ఆరాధిస్తున్నా
ఆమె:
       కొన్నాళ్ల నుంచి ఎన్నో విధాలా ఆలోచిస్తున్నా
అతడు:
       మన్నించావనుకో ధన్యుణ్ణై పోనా
ఆమె:
       సయ్యన్నాననుకో చిక్కుల్లో పడనా
అతడు:
       నీపై ఎంత ప్రేమో చూపనీవా కొద్దిగా
ఆమె:
       ఏమో ఏమి ప్రేమో పోల్చనీవా బొత్తిగా
                               ||అందీ అందక||
.
.
              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..