|
Context
Song Context:
మరో రుక్మిణి కల్యాణం! |
Song Lyrics
||ప|| |అతడు|
రుక్ రుక్ రుకుమిణి రమణి సుగునమణి రబ్బా హోయిరబ్బా
చక చక చక రధమును తెమ్మనే రబ్బా హోయిరబ్బా ||రుక్ రుక్ ||
కిలాడి కృష్ణుణ్ని తరలిరమ్మని తయారుగున్నది వారేవ్వా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగవుందిరా వారెవ్వా
||రుక్ రుక్ ||
.
చరణం: కోరస్:
ముద్దులగుమ్మ పుత్తడిబొమ్మ బుగ్గమీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా ||2||
అతడు:
విరిసి విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా
అందమైన కుందనాల కూనా నీ అండ చేరుకున్నది కదరా కన్నా
పొందికైన సుందరవదన నీ పొందుకూరుతున్నది పదరా నాన్నా
సొంపులందుకో కోరస్: హోయ్
స్వర్గమేలుకో కోరస్:హోయ్
చిన్నదాని వన్నెలన్ని కన్నెదానం అందుకోని నవాబువైపోరా
నీ నసీబు మారును రా
||రుక్ రుక్ ||
.
చరణం: అతడు:
కలికి నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెనా
చిలకా నీజత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలేనా
అరెరె బంగరు జింకా నీకు ఇంతలోన అంతటి సిగ్గా సిగ్గా
అప్పుడే ఏమైంది గనుక ఇక ముందుంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా కోరస్: హోయ్
జంటకట్టగా కోరస్:హోయ్
హోరుహోరు హోరుమంటూ ఉరువాడా అంతా చేరి
హుషారు హంగమా మహా ఖుషీగా చేద్దామా
||రుక్ రుక్ ||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
[Also refer to pages 58-59 in కల్యాణ రాగాలు]
……………………………………………………………………………………………….. |
|
No Comments »