|
Context
Song Context:
మౌనమే మోహనరాగమయే వేళ, మరుగేలా ఓ చందమామ!
A sweet love song! |
Song Lyrics
||ప|| |ఆమె|
మరుగేలా మబ్బుముసుగేలా ఓ చందమామ ఓ చందమామ
మనసున మల్లెలు విరిసిన వేళ - మమతల పల్లవి పలికిన వేళ
మౌనమే మోహనరాగమయే వేళ
||మరుగేలా||
.
చరణం:
మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా
చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా
కనుచూపుల చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు
మది వీధిలో స్వప్నాలకే సంకెళ్ళు వేసేటి జంకెందుకు
ఊయలలూగే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ
మౌనమే మోహనరాగమయే వేళ
||మరుగేలా||
.
చరణం:
కాంచన కాంతుల కాంక్షల బాట కనబడలేదా
కొమ్మల కూసిన కోయిల పాట వినబడలేదా
ఉలితాకిన శిలమాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి
చలిచాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి
చెంతకుచేరే సుముహూర్తాన ఆశలు తీరే ఆనందాన
మౌనమే మోహనరాగమయే వేళ
||మరుగేలా||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »