|
Context
Song Context:
A teasing song by him |
Song Lyrics
||ప|| |అతడు|
ఐశ్వర్యరాయి నీకు అక్కైనట్టు నా బోటివాళ్ళ లెక్కేటంటు
నువ్వేదో అందరాని చుక్కైనట్టు ఆ పోజులింక కట్టిపెట్టు
లవ్ మీ ఓ డార్లింగ్ అంటూ నా చుట్టు తిరిగేటట్టు
చేసే వెళ్తా ఈరోజు నీ మీదొట్టు
ఇయ్యాయి ఇయ్యాయే ఇయ్యాయి ఇయ్యియే ఇయ్యాయి ఇయ్యియే ||2||
.
చరణం:
నాజూగ్గా నడుమూగిస్తూ నడివీధిలో పడ్డాక
చస్తానా కళ్ళారా చూడక
పొందిగ్గా పొట్లం కట్టి ఏ కన్ను పడనీక
దాచేసుకో సోకు చాటుగా
అది గుత్తంగా దూసేసి మతిపోగొట్టే లుక్కేసి
అది చూస్తే మాత్రం గోలెడతావా హాహాకారం చేసి
అది హత్యానేరం కాదే మహ అత్యాచారం కాదే
మగపుట్టుక పుట్టి సరదా పడవద్దంటావా
ఇయ్యాయి ఇయ్యాయే ఇయ్యాయి ఇయ్యియే ఇయ్యాయి ఇయ్యియే ||2||
||ఐశ్వర్య||
.
చరణం:
అందంలో టైటానిక్ హీరోయిన్ లా నువ్వుంటే
ఏదో అయిపోదా కుర్రాళ్ళకి
ఖండాలా ఆతీ హై క్యా అనాలి అనిపిస్తుంటే
హిందీ వచ్చేస్తోంది భాషకి
రంగేళి ఊర్మిళ్లాగా బెంగాలి రసగుల్లాగ
సింగారం ఊరిస్తుంటే ఏదో బెంగరేగేవేళ
బంగాళఖాతంలాగా గుండెల్లో దిగులు గోల
కంగారెత్తిస్తూ ఉంటె కుచ్ కుచ్ హోతా హై
ఇయ్యాయి ఇయ్యాయే ఇయ్యాయి ఇయ్యియే ఇయ్యాయి ఇయ్యియే ||2||
||ఐశ్వర్య||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »