|
Context
Song Context:
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ!
నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని! |
Song Lyrics
||ప|| |అతడు|
ఆకాశం సాక్షిగా
|ఆమె|
భూలోకం సాక్షిగా
||ఆకాశం సాక్షిగా||
|అతడు|
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
|ఆమె|
నిజం చెప్పనీ నిను పూజించాననీ
|అతడు|
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ
|ఆమె|
నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని
|అతడు|
నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా
|ఆమె|
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
|అతడు|
నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
|ఆమె|
నిజం చెప్పనీ నిను పూజించాననీ
.
||చ|| |అతడు|
కొమ్మ పైన ఆ చిలక ఊసులేమి చెప్పింది
బొమ్మ లాగ ఈ చిలక పరవశించి విన్నది
|ఆమె|
పంజరాన చెర కన్నా పర్ణశాల మేలన్నది
రాముడున్న వనమైనా రాణివాసమన్నది
|అతడు|
అన్నా అనుకున్నా అడవి అంతఃపురమవునా
|ఆమె|
అయినా ఎవరైనా ఇది కొనగల వరమేనా
|అతడు| ||నిరూపించుకోనీ||
|ఆమె| ||నివేదించుకోనీ||
|అతడు| ||నిను స్వాగతించు||
|ఆమె| ||నీ చెలిమి||
|అతడు|
ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
|ఆమె|
నిజం చెప్పనీ నిను పూజించాననీ
||ఆకాశం సాక్షిగా||
.
||చ|| |ఆమె|
సప్తపదిన సాగమని ప్రేమ నడుపుతున్నదట
ఏరికోరి ఇద్దరినీ ఎందుకల్లుకుందట
|అతడు|
నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమనేది ఉన్నదట
నీవు నేను కలవనిదే తనకి ఉనికి లేదట
|ఆమె|
ప్రణయం ఇక నుంచీ మన జతలో బతకాలి
|అతడు|
నిత్యం వికసించే మధులతగా ఎదగాలి
|ఆమె| ||నివేదించుకోనీ||
|అతడు| ||నిరూపించుకోనీ||
|ఆమె| ||నీ చెలిమి||
|అతడు| ||నిను స్వాగతించు||
|ఆమె|
రవికిరణం సాక్షిగా తడి నయనం సాక్షిగా
నిజం చెప్పనీ నిను పూజించాననీ
|అతడు|
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
||ఆకాశం సాక్షిగా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
It never becomes “casual” with Sirivennela, even if it is yet another - same old - love song concept! regardless of what the star cast is, what banner it is, who the director is!
Follow the thought process!
.
ఆకాశం సాక్షిగా, భూలోకం సాక్షిగా
నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా
ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా
రవికిరణం సాక్షిగా తడి నయనం సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
నిజం చెప్పనీ నిను పూజించాననీ
.
నిరూపించుకోనీ నీ ప్రేమే నా ప్రాణమనీ
నివేదించుకోనీ నీ ప్రేమకి నా హృదయాన్ని
.
నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
.
నిన్ను నన్ను నమ్ముకునే ప్రేమనేది ఉన్నదట
నీవు నేను కలవనిదే తనకి ఉనికి లేదట Wow!
.
ప్రణయం ఇక నుంచీ మన జతలో బతకాలి
నిత్యం వికసించే మధులతగా ఎదగాలి Huh!
.
Sir, we are fortunate! what more can I say?
……………………………………………………………………………………………….. |
|
No Comments »