|
Context
Song Context:
చంద్రుడైనా చుక్కల్నొదిలేసి, నాలా బందిపోటై రాడా నీకేసి!
|
Song Lyrics
||ప|| |అతడు|
జింక వేటకి సింహంలా వస్తా
దాచిపెట్టిన సొత్తే కాజేస్తా
|ఆమె|
దొంగ చేతికి తాళాలందిస్తా
తోచినట్లుగా దోచుకుపొమ్మంట
|అతడు|
కోహినూరు మణి నిను కోటదాటిస్తా
కాసుకో రమణీ కనికట్టు చేసేస్తా
|ఆమె|
కొల్లగొట్టమని నిధులన్ని చూపిస్తా
కళ్లు మూసుకుని వగలన్ని వలిచిస్తా
|అతడు| అడగాలా |ఆమె| ఆగాలా
|| జింక వేటకి ||
.
||చ|| |అతడు|
కన్నే చెదిరేలా ఎదురైతే నీ కన్నె ఖజానా
నిన్నే వదిలేస్తే అది మగ జన్మేనా
వెన్నే అదిరేలా చిటికేస్తే నే చిత్తైపోనా
వెన్నై కరిగిస్తే ఒడిలో వాలనా
|ఆమె|
చంద్రుడైనా చుక్కల్నొదిలేసి
నాలా బందిపోటై రాడా నీకేసి
అందుకేగా బింకం వదిలేసి
నిన్నే అల్లుకున్నా రాజీకొచ్చేసి
|అతడు| ||కోహినూరు మణి||
|ఆమె| ||కొల్లగొట్టమని ||
|అతడు| అడగాలా |ఆమె| ఆగాలా
|| జింక వేటకి ||
.
||చ|| |ఆమె|
నానా హైరానా పడుతున్నా ఈ ఏకాంతాన
నువ్వే కరుణిస్తే పరదా దాటనా
|అతడు|
రానా దొరకూనా సుడిగాలై ఎగరేసుకుపోనా
జంటై కలిసొస్తే చెర విడిపించనా
|ఆమె|
సాహసానికి సంతోషిస్తున్నా
నీలో పౌరుషానికి పట్టం కడుతున్నా
|అతడు|
లోకమంతా ఎదురై వస్తున్నా
నాతో తీసుకెళతా యుద్ధం చేసైనా
|ఆమె| ||కొల్లగొట్టమని ||
|అతడు| ||కోహినూరు మణి||
|అతడు| అడగాలా |ఆమె| ఆగాలా
||దొంగ చేతికి ||
||జింక వేటకి||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A seemingly lighter love song, but you won’t realize, unless you dive in, how much power-packed it is
………………………………………………………………………………………………..
|
|
No Comments »