|
Context
Song Context:
హక్కనేది ఒకరిచ్చే దానం కాదని మహిళా గుర్తించు
.
సంఘంలో స్త్రీ పురుషులిద్దరు చెరీ సగమన్నది చాటించు
అసమానతలు అసహాయాతలు లేని సమాజం స్థాపించు
.
మానవతా నీ చరిత మారేందుకు అదే శ్రీకారం
|
Song Lyrics
||ప|| |అతడు|
ఆది శక్తి వని ఆలయాలలో హారతినిచ్చే వాళ్లు
సాటి మనిషిగా స్థానం ఇస్తే స్త్రీ జాతికి అది చాలు
అమ్మకాలు పెంచేందుకు అతివను బొమ్మను చేసేవాళ్లు
అక్కర తీర్చే వస్తువుకాదని ఎప్పుడు గుర్తిస్తారు
హక్కనేది ఒకరిచ్చే దానం కాదని మహిళా గుర్తించు
దిక్కులేని ఈ ఆలాపనలను మాని ఉద్యమించు
సంఘంలో స్త్రీ పురుషులిద్దరు చెరీ సగమన్నది చాటించు
అసమానతలు అసహాయాతలు లేని సమాజం స్థాపించు
మనసు ఉన్న ప్రతిఒక్కరు అందుకు అందించాలి సహకారం
అందించాలి సహకారం
మానవతా నీ చరిత మారేందుకు అదే శ్రీకారం
మానవతా నీ చరిత మారేందుకు అదే శ్రీకారం
.
.
(Contributed by Bhagirathy) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »