|
Context
Song Context:
మగ రాక్షసుడు |
Song Lyrics
||ప|| |అతడు|
త్రేతాయుగమవగానే రాముడు పోయాడు
కోరస్ :
కానీ రావణుడున్నాడు
అతడు :
ద్వాపరయుగమవగానే భీముడు పోయాడు
కోరస్ :
కానీ కీచకుడున్నాడు
అతడు :
పాత రామాయణాలు భీమాయణాలు చూసేది ఏముందిలెండి
నిత్య కామాయణలు భామాయణలు మళ్ళీ మళ్ళీ చూడండి
కోరస్ :
ఓ లాయర్ బాబు ఓ డాక్టర్ బాబు ఓ టీచర్ బాబు ఓ వ్యూచర్ బాబు
చిన్నపెద్ద క్లాసుమాస్ తేడాలేకుండా అంతా ఆడండి
ఈ నడివీధి భాగోతమో చూడండి వంత పాడండి
పల్లవి : అతడు:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను
మగవాడిని నేను మగువల పగవాడిని నేను
ఆడదంటే అందమైన బొమ్మ ।।2।।
నేనానుడుకుందుకే సృష్టించాడు ఆ బ్రహ్మ
కోరస్:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను
అతడు:
తిండికి బట్టకి లోటు లేని వాణ్ణి నేను
అయినగాని పరమ దరిద్రుణ్ణి నేను
నా కళ్లకి సెక్సాటలే అసలేంతకి తీరవే మరి
ఇరుగు పొరుగు ఇళ్లలో ముద్దు గుమ్మ లెవరైనా ముస్తాబవుతుంటే చాలు
కిటికీలకు ఆ కర్టెన్లకి ఎరవేసి కరువుగా చూస్తుంటాను
కోరస్:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను
అతడు:
అచ్చోసిన అంబోతును పచ్చి పోరం బొకును నేను
రోడ్డు పార్కులు హాళ్ళు గుళ్ళు బస్టాపూలూ నా చిరునామా
ఎదురవకుండా వుంటుందా ఓ సీతాకోక చిలకమ్మా
కనిపించే బంధమే సెక్సెరే చూపుతో
దాగున్న దేహామంత నీలి ఊహతో
కోరుక్కు తింటుంటే హమ్మ తరించి పోదా నా జన్మ
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను ।।2।।
అతడు:
సీజన్ టిక్కెట్టు కొంటాను ప్రతి సిటీ బస్సు ఎక్కుతాను
రద్దీ చూసుకుంటాను లెడీస్ మధ్య సర్దుకుంటాను
ముందు జనం వెనక జనం రైట్ జనం లెఫ్ట్ జనం
అందరికి థాంక్స్ అంటాను – అందినంత వేడి రుద్దుకుంటాను
||మగవాడిని నేను||
విమల కమల లీల సరళ అబ్బో ఎంత కళ కళ
వీళ్ళే లేకుంటే ఆఫీసు అయ్యో ఎంత వెల వెల
బల్లకిందనుంచి వాళ్ల కాళ్లు టై పు మిషన్ మీద వాళ్ళ వెళ్లు
వీలై నప్పుడు వాళ్ల ఒళ్ళు ఇవే కద నాకిష్టమైన పన్లు
కోరస్:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను ।।2।।
అతడు:
పెళ్ళి చూపులవు వచ్చాను పెట్టినవన్ని మెక్కే సాను ।।2 ।।
పోట్టో పొడుగో మెచ్చాను ఎంతోస్తుందో లెక్కేశాను
అడిగితే బాగోదేమాగాని కన్యేగా అనుకున్నాను
అయితే నేనే రేపే ఎట్టాగాఐన ఆచూకి తీస్తాను
అప్పుడే ఒకే చేస్తాను కట్నంగాని తేడా వస్తే కిరోసిన్ తో ఆంటిస్తాను
కోరస్:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను
అతడు:
అయ్యో అయ్యో ఏంచేయాలి మొగుణ్ణి అయ్యగా ఖర్మ కాలి ।।2।।
ఆలి తోటి కలిసి కాలు కాస్త బైట పెడితే చాలు
అడ్డమైన వాడి కళ్ళు నా భార్య మీదేవాలు
ఎట్టా కాపు కాయాలి ఎట్టా కాపుకాయాలి
అయ్యో అయ్యో ఏంచేయాలి మొగుణ్ణి అయ్యగా ఖర్మ కాలి
పని పాట లేని ప్రతి వెధవ నా పెళ్లన్ని చూసి పళ్లికిలిస్తే ఒళ్ళు మండుతుంది ఒక పక్క
కాని ఇంతలోన పక్కనున్న పడుచు పిల్ల పైట జారి మనసు లాగుతుంది అటు పక్క
కోరస్:
మగవాడిని నేను మీసమున్న మగవాడిని నేను ।।2।।
.
.
(Contributed by Bhagirathy) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
No Comments »