Archive for January 22nd, 2010

యజ్ఞం: చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Yagnam
Song Singers
   S.P. Balu,
   Shreya Goshal
Music Director
   Mani sharma
Year Released
   2004
Actors
   Gopi Chand,
   Sameera Banerjee
Director
   A.S. Ravikumar Chowdary
Producer
   Pokuri Babu Rao

Context

Song Context:
      చిన్ననాటి చెలికాండ్లు - ఈ ప్రేమికులు

Song Lyrics

||ప|| |ఆమె|
       చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే
అతడు:
       చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే
ఆమె:
       రమ్మనే తన అల్లరి
అతడు:
       ఝుమ్మనే నా ఊపిరి
                                                       ||చిన్ననాటి||
.
చరణం: ఆమె:
       సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
       దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
అతడు:
       చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
       చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
ఆమె:
       చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి
అతడు:
       సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
ఆమె:
       మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
       రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే
                                                       ||చిన్ననాటి||
.
చరణం: అతడు:
       తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో
       వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
ఆమె:
       మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
       వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
అతడు:
       మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
ఆమె:
       మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
అతడు:
       కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
       ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ
                                                       ||చిన్ననాటి||
.
.
                                (Contributed by Prabha)

Highlights

………………………………………………………………………………………………..