|
Context
Song Context:
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! |
Song Lyrics
||ప|| |అతడు|
యవ్వనవీణా! పువ్వులవానా!
నువ్వెవరే నా మదిలొ చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! ||2||
||యవ్వన||
.
చరణం:
నువ్వంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది కాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంతవెలుగు నావంక రాను అంది కంటికునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||
.
చరణం:
ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా!
ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా!
మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపె చూస్తున్నా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
[Also refer to Page 147 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
No Comments »