Archive for March, 2010

గోకులంలో సీత: గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

Posted by admin on 26th March 2010 in గోకుల కృష్ణా

Audio Song:
 
Movie Name
   Gokulamlo Seetha
Song Singers
   S. P. Balu,
   Chitra
Music Director
   Koti
Year Released
   1997
Actors
   Pawan Kalyan,
   Raasi
Director
   Mutyala Subbaiah
Producer
   Narjala Dasaradhi,
   B. Srinivasa Raju

Context

Song Context:
       గోకుల కృష్ణా!

Song Lyrics

|పిల్లలు|
       ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే
       వెన్న కొల్ల గొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే
||ప|| |ఆమె|
       గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా
       మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
       పదుగురి నిందలతో పలుచన కాకయ్యా
       నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
|ఖోరస్|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
                                        || గోకుల ||
.
||చ|| |ఆమె|
       ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా
|అతడు|
       ఆ.. ఊరంత చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధిక
|ఆమె|
       చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా
|అతడు|
       ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా
|ఆమె|
       తెలియని లీలలతో తికమక చేయకయా
|అతడు|
       మనసుని చూడకనే మాటలు విసరకలా
|ఆమె|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
|ఖోరస్|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
                                          || గోకుల ||
.
||చ|| |ఆమె|
       ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు
|అతడు|
       అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు
|ఆమె|
       తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు
|అతడు|
       మాయని దూరము చేసిన గీతాచార్యుడు
|ఆమె|
       కనుకనే అతని కథ తరములు నిలిచె కదా
|అతడు|
       తలచిన వారి ఎద తరగని మధుర సుధ
|ఆమె|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
|ఖోరస్|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
|అతడు|
       గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా
       అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
       అందెల సందడితో గుండెలు మురిసెనురా
       నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
|అందరు|
       జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
.
.
              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..