|
Context
Song Context:
పేకాట తెలుగింట్లో!
A hilarious running commentary 
|
Song Lyrics
సాకి:
ఏయ్ మూర్తి డబ్బులు కరెక్ట్‌గా పెట్టి టేబిల్ దగ్గర కూర్చో
లేకపోతే చేతులు ఇరిగిపోతాయ్ - కట్ ఫర్ సిక్స్
వాడి పేక చూస్తావేంట్రా
మన పేక ఎప్పుడైనా చూసుకోవచ్చు కదోయ్!
ఆకార్డు నాక్కావాలి మిడిల్ డ్రాప్ చేసుకో లేకపోతే కేసు పెడతా
ఒరెయ్ నీ! డ్రాప్ రా! షో షో!
.
పల్లవి: అతడు:
అమ్మదీని తస్సాదియ్యా గుమ్మం దాకా వచ్చిందయ్యా షో! షో! షో!
నమ్ముకున్న ముక్క రాక సొమ్ము కాస్త దోచిందయ్యా షో! షో! షో!
కోసే దాక ఆశే పోక చూసేశాక ఎ.సి.పేక భేషో! శహభాషో!
||అమ్మదీని||
.
చరణం: ఆమె:
ఏసెయ్ బాసు ఇస్పేటాసు నొక్కేసావో లెక్కేసావే షో! షో! షో!
అతడు:
చూసెయ్ బోసు ఏదీ పర్సు డీలే నాది డీలా నీది షో! షో! షో!
జోకరు వాటము పట్టానమ్మో చేతుల తీటకు చెడ్డానమ్మో! రమ్మి నిన్నునమ్మి
||ఏసెయ్||
.
డైలాగ్:
లెక్కెట్రా! లెక్కెట్టు!
కొట్టక కొట్టక ఆట కొడితే గాత్రం అంటావ్ ఒరేయ్
ఏం బాస్ కౌంటా
జీవితమే పెద్ద కౌంట్ బ్రదర్ - ఏమీ చెయ్యలేము
అతడు:
ఆఠీన్ రాణి అందిందహో! బ్యూటీబోణి అయ్యిందహో షో! షో! షో!
డైమండ్ జాకీ తన్నిందయ్యో ఆటకి బాకీ అంటానయ్యో షో! షో! షో!
ఆమె:
అపుడే చెయ్యకు బాబు డ్రాపు ముంచుకువస్తే యం.డి.సేఫ్ ఆడు వేటాడు
||ఆఠీన్||
.
చరణం: డైలాగ్:
ఒరేయ్ వాడు విపరీతంగా వణికిపోతున్నాడు
డీల్ అనుకుంటా డ్రాప్ అయిపోరా
చెప్పటాల్లేవబ్బాయ్
అతడు:
పారెయ్‌లేక పీకే పేక ముంచిందయ్యా పీకల్దాకా షో! షో! షో!
ఆఖరుదాక జోకరు రాక షేకొచ్చింది లైఫే లేక షో! షో! షో!
ఆమె:
బొమ్మల కొలువే ముక్కలు మొత్తం తగ్గదు గురువా
లెక్కకు మాత్రం ఈ షో! ఏమి దశో!
అతడు:
భజగోవిందం, భజగోవిందం, గోవిందం, భజగోవిందం
గోవిందా! గోవిందా!
.
.
(Contributed by Prabha) |
Highlights
[Also refer to Pages 235-236 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………… |
|
No Comments »