Posted by admin on 5th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song
|
Song Lyrics
||ప|| |అతడు|
బొమ్మలాంటి ముద్దుగుమ్మ వగలు చూపితే
బ్రహ్మ తాత కైన రిమ్మతెగులు పుట్టదా
కోడె ఈడుకి వేడి ఎక్కువ
తోడుచిక్కినాక ఆగదమ్మా మక్కువ
ఆమె:
కొత్త ఈడు మత్తుజల్లి సెగలు రేపితే
కన్నె లేతమనసులోన దిగులు పుట్టదా
కళ్ళ ముళ్ళతో నువు గిచ్చితే
చిచ్చుపుట్టి రెచ్చ గొట్టి పిచ్చి పట్టదా
.
||చ|| అతడు:
హొయలు ఒలికే చెలియ తళుకే తొలకరించిన వానచినుకు
ఆమె:
పలకరించే చిలిపితలపే చిలకరించెను తేనె చినుకు || హొయలు||
అతడు:
కలతరాతిరంతా కలల జాతరా
ఆమె:
పులకరింతలోన తీపికోతరా ||కలత||
ఇద్దరు:
మరపించి కరగించి కథపెంచే తొలివలపిది
||బొమ్మలాంటి ||
.
||చ|| అతడు:
ఇంత సిగ్గుదేనికమ్మా వింతనిగ్గుల కన్నెమొగ్గా
ఆమె:
పిల్లగాలి గిల్లిపోయేను కందిపోయేను లేత బుగ్గా||ఇంత||
అతడు:
వన్నెచిన్నెలన్నీ వెన్నెలయేను
ఆమె:
నిన్నుచేరి ఎడమ పున్నమాయేను || వన్నె||
అతడు:
చిరునవ్వే విరజిమ్మే సిరిమల్లెల విరిజల్లు
||కొత్త||
.
.
(Contributed by Dr. Jayasankar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »