Posted by admin on 19th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
పల్లవి: ఆమె:
ముద్దుగా రావేమి ముంతకిందపప్పుసామి
ముద్దుగుమ్మ రమ్మంటె ముచ్చటేలేదేమి ||ముద్దుగా||
ఈ సోకుల్తో చుక్కల్నే రప్పించనా
నువ్వు కన్నేస్తే వెన్నల్లే గుప్పించనా గుప్పించనా గుప్పించనా
అతడు:
జున్నులాగున్నావే జువ్వలపాలెం బుల్లి
జుర్రుకోమంటావా చూపులతో గిల్లి గిల్లి ||జున్ను||
నీ వన్నెల్లో వెన్నదీసి కరగేయనా
నా వలపుల్లో కలిపేసి గుటకెయ్యనా గుటకెయ్యనా గుటకెయ్యనా
||ముద్దుగా||
.
చరణం: ఆమె:
మల్లెతోటలో మామనుకుంటా బంతులాటలో బావనుకుంటా ||2||
వచ్చిన వయసును వాటేసుకునే నచ్చినవాడివి నీవనుకుంటా
ఏమంటావు ఏమంటావు అవునంటావా కాదంటావా
అతడు:
అందం అంటే ఆరని మంటా అంతటితో నువ్వు ఆగమంట
ఆగకుండ రేగుతుంటె చెప్పకుండ జారుకుంట అంతదాక ఎందుకంటా
||ముద్దుగా||
.
చరణం: అతడు:
గంతకు తగ్గ బొంత చూసుకో ఒడ్డుకు తగ్గ పొడుగు చూసుకో ||2||
ఇచ్చిన మనసును మచ్చిక చేసే వెచ్చని నీడకు వచ్చి చేరుకో
ఏమంటావు ఏమంటావు అవునంటావా కాదంటావా
ఆమె:
సొమ్మువున్నది సోకుచేసుకో సోకువున్నది సొమ్ముచేసుకో
లంకెబిందెలాంటిదాన్ని లబ్జులెన్నో ఉన్నదాన్ని సుక్కలెంట సూడకంటా
||జున్ను||
||ముద్దుగా||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »