Posted by admin on 19th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
పల్లవి: అతడు:
ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి బడిలో అంతే
తనువులు తగిలి తలపులు రగిలి వదలని ఒడిలో ఉంటే
అధరం అధరం అంటితే మధువుల గుణకారం
జతలో బిడియం జారితే జరిగే తొలి భాగహారం
||ఒకటికి||
.
చరణం: అతడు:
చామంతి సింగారమా పూబంతులాడించనా
నీ చెంప సంపెంగలో లేసిగ్గు చిందించనా
ఆమె:
తొలకరి కోరిక తలుపులు తీయనా
దొరికిన తోడుతో ఉరకలు వేయనా
అతడు:
ముప్పూటలా ముద్దాటలో ముత్యాల ముచ్చట్ల ముళ్ళేసుకోనా
||ఒకటికి||
.
చరణం: ఆమె:
దీపాన్ని పోపొమ్మని కోపాలు చూపించనా
తాపాన్ని లేలెమ్మని ఆహ్వానమందించనా
అతడు:
కలగను రేయిలో కువకువలాడనా
కలిగిన హాయితో కవితలు పాడనా
ఆమె:
కంగారుగా రంగాలలో శృంగార గంగా తరంగాలు తేల
||ఒకటికి||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »