|
Context
Song Context:
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా! |
Song Lyrics
పల్లవి:
పొద్దే రాని లోకం నీది
నిద్రే లేని మైకం నీది || పొద్దే రాని||
పాపం ఏలాలి పాడాలి జాబిలి
అయినా ఏజోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా
చూడని కళ్ళే తెరిచేలా
ఇలా నిను లాలించేదా లేలేమ్మని..
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా
.
చరణం:
ఎన్నో రుచులు గల బ్రతుకుంది
ఎన్నో రుజువులతో పిలిచింది
చేదోక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలి వేస్తానంటావా
కలకాలమూ కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా
|| పొద్దే రాని||
.
చరణం:
నీలో చూడు మంచి మనసుంది
ఏదో నాడు మబ్బు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనే మసిచేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా
నిను తాకిందేమో ఈ వేదన
మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
[Also refer to Pages 98-99 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………….. |
|
No Comments »