Posted by admin on 26th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A Love Song! |
Song Lyrics
||ప|| |అతడు|
నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా
తెగ వెంటపడుతుంటే నీకు ఇంత అలుసా
నేనంత కాని వాణ్ణి కాదు కద కన్నె వయసా
నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే
నన్నే నన్నే ఒప్పుకోక తప్పదిక నన్నే
||నువ్వెంత అందగత్తెవైనగాని||
.
||చ|| |అతడు|
అవును అంటే నిను చూసుకోన మహరాణి తీరుగా
కాదు అంటే వదిలేసి పోను అది అంత తేలికా
లేని పోని నకరాలు చేస్తే మర్యాద కాదుగా
ఇంత మంచి అవకాశమేది ప్రతి సారి రాదుగా
తగనివాడినా చెలీ తగువు దేనికే మరీ
మనకు ఎందుకే ఇలా అల్లరీ
||నువ్వెంత అందగత్తెవైనగాని ||
.
||ప|| |అతడు|
కన్నె గానే ఉంటావ చెప్పు ఏ జంట చేరక
నన్ను మించి ఘనుడైన వాణ్ణి చూపించలేవుగా
మీసమున్న మగవాణ్ణి కనుక అడిగాను సూటిగా
సిగ్గు అంటూ పడుతుంటే చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది తెలుసుకోవే అన్నది
బదులు కోరుతున్నది నా మది
||నువ్వెంత అందగత్తెవైనగాని ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »