Posted by admin on 9th April 2010 in
పంతం
|
Context
Song Context:
బ్రహ్మం గారి జ్ఞానం, వేమన వేదం అందించిన, ఆ రాయల చిరునామా,
ఈ రతనాల సీమ - పంతమే సాక్షి కసితీరే వేళ జాతర చెయ్యాలా!
|
Song Lyrics
||ప|| |అతడు|
వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి
పసుపు కుంకుమే సాక్షి పంతమే సాక్షి
పచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డ
కక్ష కడిగింది మా ఆడబిడ్డ కసితీరే వేళ
.
|అతడు|
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
|ఖోరస్|
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
|అతడు|
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!
హే…అశ్శరభా…దరువెయ్ దశ్శరభా!
మనమియ్యాలా…
|ఖోరస్|
ఉయ్యాలే ఎయ్యాలా
జాతర చెయ్యాలా! రారే రారే
|అతడు|
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
|ఖోరస్|
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!
.
||చ|| |అతడు|
కారం తిన్న కండలివీ - రగతం మరిగే కత్తులివీ
మీసం దువ్వే దమ్ములివీ - రోసం రగిలే రమ్ములివీ
ఎవరైనా రానీ… |ఖోరస్| ఓ..ఓ..ఓ
ఏమైనా కానీ…. |ఖోరస్| ఓ..ఓ…ఓ
నీ సేవలోనే… |ఖోరస్| నీ సేవలోనే…
మేమున్నాం సామీ |ఖోరస్| మేమున్నాం సామీ
మనసు కలిసెనంటే ఉసురైనా ధార పోస్తాం
మనసు విరిగెనంటే మరి ఊరుకోం
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!
.
||చ|| |ఆమె|
అది అహోబిలం మనకున్న మహాబలం కాదా!
|ఖోరస్|
పెరిగే పాపం నరికే నరసిమ్హుడా
|ఆమె|
శివుణ్ణి మన శ్రీశైలం కట్టేసిందా లేదా
|ఖోరస్|
మనమా దొరకి భటులం అయ్యా కదా
|అతడు2| బ్రహ్మం గారి జ్ఞానం… |ఖోరస్| వేమన వేదం
|అతడు2| అందించిన పుణ్యం |ఖోరస్| మనకే సొంతం
|ఆమె| ఈ రతనాల సీమ |ఖోరస్| ఈ రతనాల సీమ
|ఆమె| ఆ రాయల చిరునామా |ఖోరస్| ఆ రాయల చిరునామా
|ఖోరస్|
ఏడుకొండల పైన కొలువైన యెంకటరమణ
మనం పిలవగానే తనే దిగిరాడా
|అతడు|
సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా ||2||
తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా
హే…అశ్శరభా…దరువెయ్ దశ్శరభా
మనమియ్యాలా ఉయ్యాలే ఎయ్యాలా
జాతర చెయ్యాలా! రారే రారే
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »