Archive for April 9th, 2010

అంతఃపురం: కళ్యాణం కానుంది కన్నె జానకికీ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Antah puram
Song Singers
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1998
Actors
   Jagapathi Babu,
   Soundarya,
   Sai Kumar
Director
   Krishna Vamsi
Producer
   Kiran

Context

Song Context:
       ఆకాశం అంతఃపురమయ్యింది - నా కోసం అందిన వరమయ్యింది
       రావమ్మా మహరాణి ఏలమ్మా కాలాన్ని అంది ఈ లోకమే అంతాసౌందర్యమే

Song Lyrics

|పిల్లలు|
       కళ్యాణం కానుంది కన్నె జానకికీ ||2||
       వైభోగం రానుంది రామ చంద్రుడికీ ||2||
|ఖోరస్|
       దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకీ
|పిల్లలు|
       రావమ్మా సీతమ్మ సిగ్గు దొంతరలో
       రావయ్యా రామయ్యా పెళ్లి శోభలతో
.
|ఆమె|
       వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా
       వర్షంలో తడిసే సంద్రం లాగా
       ఊరేగే పూవుల్లో చెలరేగే నవ్వుల్లో
       అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే
                          ||వెన్నెల్లో నడిచే ||
.
||చ|| |ఆమె|
       నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
       నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవి
       కళ్ళలోనే వాలి నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
       ఆ గగనాన్ని ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
       నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
       చూస్తూనే నిజమై అవి ఎదటే నిలిచాయి
       అణువణువూ అమృతంలో తడిసింది అద్భుతంగా
                           ||వెన్నెల్లో నడిచే ||
.
||చ|| |ఆమె|
       ఇట్టే కరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
       వెనకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపటం
       మదిలా మంటే నేడు తీయని స్మృతిగా మారి ఎటో పోతుందీ
       కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తనూ వస్తుందీ
       ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
       పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
       నూరేళ్ల కానుకల్లే నీ చేతికీయలేనా
       ఆకాశం అంతఃపురమయ్యింది
       నా కోసం అందిన వరమయ్యింది
       రావమ్మా మహరాణి ఏలమ్మా కాలాన్ని
       అంది ఈ లోకమే అంతా సౌందర్యమే
                        ||ఆకాశం అంతఃపురమయ్యింది||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

[Also refer to Page 53 in కల్యాణ రాగాలు]
…………………………………………………………………………………………………