Posted by admin on 23rd April 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song between ఒక మానవుడు మరియు ఒక దేవలోక అప్సర! |
Song Lyrics
||ప|| |ఆమె|
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగు చెయ్యక ||మానవా||
విన్నపాలనే ఆలకించిన అప్సర నేనేరా
స్వర్గభాగమే నేల దించిన కిన్నెర నేనేరా
ఇంద్ర లోకమొచ్చి కళ్ల ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన
ఇంత దూరమొచ్చినాక ఇంకా అందుకోవా సోకు సూచనా
|అతడు|
అమ్మకు చెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో ||అమ్మకు ||
.
||చ|| |అతడు|
పక్కకొచ్చెనే తిక్క పెంచెనే
పక్కకొచ్చేనే తిక్క పెంచెనే వయ్యారి నీ వాలకం
|ఆమె|
దిగ్గజాలనే ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే నరుడా నీలో సాహసం
|అతడు|
మైకంలో ముంచుతున్నది పాపా నీ పనితనం
|ఆమె|
మోహంలో ముంచుతున్నది నరుడా నీ మగతనం
|అతడు|
కొంటె కోరిక రెచ్చగొట్టక చుక్కా చాలింకా
|ఆమె|
వేడి వేడిగా జోడు కూడగా వచ్చా నీ వంకా
|అతడు|
చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మా
సందేహిస్తే ఎల్లా ముందుకు రావమ్మా || మానవా ||
.
||చ|| |ఆమె|
తియ్యతియ్యగా అందజేయనా
తియ్యతియ్యగా అందజేయనా పెదవుల్లోని అమృతం
|అతడు|
మత్తు ముద్దుగా ఊపుతున్నదే
మత్తు ముద్దుగా ఊపుతున్నదే పిల్లో నన్నే నీ నడుం
|ఆమె|
కౌగిళ్లో వాలమన్నది ఊరించే ఉత్సవం
|అతడు|
తందాన తాళమైనది చిందాడే యవ్వనం
|ఆమె|
సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీది దొరా
|అతడు|
ముద్దరాలితో ముద్దులాటలో మోక్షం పొందేలా
|ఆమె|
ఆనందం ఈ పైనా నీదే అంటున్నా
|అతడు|
ఏదేమైనా మైనా నీతో నే రానా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »