|
Context
Song Context:
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!
(Do you ever understand yourself?)
|
Song Lyrics
||ప|| |ఆమె|
నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్లైనా
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా ||2||
ఏం కోరుతోంది అన్వేషణ
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు ||
.
||చ|||ఆమె|
నీకేం కావాలో అడగాలనుకుంటే ప్రశ్నంటు ఉండాలిగా
నీ భావం ఏదో చెప్పాలనుకుంటే స్పష్టంగా తెలియాలిగా
ఉయ్యాలలో పసిపాపలా అలఆటలో అలవాటులా
ఆరాటమే నెడుతుండగా పరుగెత్తకీ తడబాటుగా
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు||
.
||చ|||ఆమె|
ఈనాటి దాకా నీతోనే ఉన్నా నువ్వెతికే ఆ పెన్నిధి
చేజారే దాకా నీకే తెలీదా పోయిందనే సంగతీ
నీ గుండెలో ఈ సవ్వడి ఇన్నాళ్లుగా లేదే మరి
ఏ గువ్వకో గూడైనదీ తనకే ఇలా బరువైనదీ
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు||
||నీకే నువ్వు||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
3 Comments »