|
Context
Song Context:
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!
(Do you ever understand yourself?)
|
Song Lyrics
||ప|| |ఆమె|
నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్లైనా
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా ||2||
ఏం కోరుతోంది అన్వేషణ
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు ||
.
||చ|||ఆమె|
నీకేం కావాలో అడగాలనుకుంటే ప్రశ్నంటు ఉండాలిగా
నీ భావం ఏదో చెప్పాలనుకుంటే స్పష్టంగా తెలియాలిగా
ఉయ్యాలలో పసిపాపలా అలఆటలో అలవాటులా
ఆరాటమే నెడుతుండగా పరుగెత్తకీ తడబాటుగా
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు||
.
||చ|||ఆమె|
ఈనాటి దాకా నీతోనే ఉన్నా నువ్వెతికే ఆ పెన్నిధి
చేజారే దాకా నీకే తెలీదా పోయిందనే సంగతీ
నీ గుండెలో ఈ సవ్వడి ఇన్నాళ్లుగా లేదే మరి
ఏ గువ్వకో గూడైనదీ తనకే ఇలా బరువైనదీ
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
||నీకే నువ్వు||
||నీకే నువ్వు||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
August 27th, 2010 at 3:43 am
I think
నిన్నే నూకు చూపించాలా ఎవ్వరైనా should be
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
Please check.
This is in sync with the Gamyam song, “Entavaraku Endukoraku..”
God bless him with health and happiness.
Harsha.
August 27th, 2010 at 1:31 pm
That was a typo. thank you for pointing it out. Fixed now.
October 27th, 2010 at 9:59 pm
మనసు మాట వింటే మనమేమిటో మనకేమికావాలో స్పష్తత వుంటుందని మనకి మనమే తెలుసుకోవాల్సిన నిజం చక్కగా తెలిపారు శాస్త్రి గారు….