Posted by admin on 7th May 2010 in
నమ్మకం
|
Context
Song Context:
ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే
సమయం వెనుకపడదా ఊహ తనకన్నా ముందుంటే!
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!
|
Song Lyrics
||ప|| |అతడు|
నిన్నైనా నేడైనా రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా ||2||
ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతలు గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా
.
||చ|| |అతడు|
ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే
ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే
సమయం వెనుకపడదా ఊహ తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది లేని పోని ఈ ప్రశ్న
మనసుకున్న విలువ మరచిపోతే శాపం కాదా వరమైనా
||నిన్నైనా నేడైనా||
.
||చ|| |అతడు|
కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డంపడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా
కనులే కలలుగంటే నిద్దరేం కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా
||నిన్నైనా నేడైనా||
.
.
(Contributed by Prabha) |
Highlights
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)