|
Context
Song Context:
నిలువెల్లా గాయలే కలిగిస్తూ ఉన్నా
శిలలాంటి నను మలిచి ఉలివే అనుకున్నా!
|
Song Lyrics
||ప|| |అతడు|
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమా
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమా
అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా
పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా
|| ప్రేమించడమే ||
.
||చ|| |అతడు|
నిలువెల్లా గాయలే కలిగిస్తూ ఉన్నా
శిలలాంటి నను మలిచి ఉలివే అనుకున్నా
నువ్వు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా
వెలివేసి వెళ్తుంటే విల విల మంటల్లో
నాకూ మనసుందంటూ చుపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా
నా హృదయం నీ కోవెలైంది కొలువై ఉండుమా
|| ప్రేమించడమే ||
.
.
(Contributed by Priyanka) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)