|
Context
Song Context:
చప్పున ఒకటై పోదాం ఈ దూరం జరగని
ఎక్కడికైన పోదాం మన లోకం వేరని!
|
Song Lyrics
||ప|| |ఆమె|
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
|అతడు| ||ఏమైందో ఏమో||
.
||చ|| |అతడు|
ఏ చోటా నా పాదం నిలబడనంటుంది
ప్రతి బాటా నీ వైపే పద పద అంటోంది
|ఆమె|
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది
అది కూడ చిత్రంగా బాగానే ఉంది
|అతడు|
ఉప్పెనలా హృదయంలొ చెల రెగే కలవరం
తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం
|ఆమె|
ఎప్పుడు మొదలయిందో నను లాగే ప్రియస్వరం
ఎప్పుడు ఎటుతొస్తుందో చెబుతుందా ఈ క్షణం
|అతడు|
అనుకొకుండా పడదోసింది వలపే నన్నిలా
విడిపొకుండా ముడి వేసింది బిగిసే సంకెలా
.
||చ|| |ఆమె|
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు
కోపంతొ ఎర్రబడి కసిరే నా కళ్ళు
|అతడు|
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు
గుండె సడి ఉలికి పడి ఒకటే కంగారు
|ఆమె|
చప్పున ఒకటై పోదాం ఈ దూరం జరగని
ఎక్కడికైన పోదాం మన లోకం వేరని
|అతడు|
ఎవ్వరికి ఏ మాత్రం కనిపించం పొమ్మని
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడని
|ఆమె|
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
.
.
(Contributed by Priyanka) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)