|
Context
Song Context:
పుట్టింటిలో యువరాణిగా పారాడే నీడని కదిపిందెవ్వరే
మెట్టింటిలో మహరాణిగా పాలించే పదవిచ్చి పిలిచిందెవరే!
|
Song Lyrics
||ప|| |ఆమె|
గుండెల్లో గుడి గంట చూపుల్లో గుబులంటా
చిలకమ్మా ఈ అలజడి రేపిందెవరే
జన్మంతా తన వెంట నడిపించే నీ జంట
ఇదిగో అని నీ మనసుకి చూపిందెవరే
పుట్టింటిలో యువరాణిగా పారాడే నీ ఈడుని కదిపిందెవ్వరే
మెట్టింటిలో మహరాణిగా పాలించే పదవిచ్చి పిలిచిందెవరే
ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే
|అతడు|
ముందుగానే కొంప ముంచలేదా నీ ప్రేమ గంగ
మునిగినాక వణుకుడెందుకింకా
ముందు ముందు ఏమి జరుగుతుందా అని పెళ్ళి బెంగ
మాకు గాని మీకు దేనికింకా
.
||చ|| |అతడు|
చుట్టూ నడిరేయున్నా రెప్పల గడియేసున్నా
నీ స్వప్నం నిను చేరగా కాదనగలవారెవ్వరే
|ఆమె|
నీతో ఎక్కడికైనా వస్తా పదమంటున్నా
చెలిమే బలమై ఉండదా నిను గెలిచే ఘనుండుండడే
|అతడు|
జత కలిపిన మమకారమే
ప్రతి మలుపున మణిదీపమై
|ఆమె|
తొడై వస్తుంటే అడవైనా పూబాటగా
మారే మార్గంలో పయనించని వారెవ్వరే
ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే
|| ముందుగానే ||
.
||చ|| |ఆమె|
సగమై సర్దుకుపోగా నగలే అడ్డంకాగా
నీకై నువు వలిచెయ్యవా నిరుపేదగా ఒడి చేరవా
|అతడు|
మెళ్ళో పుస్తెల్లాగా జళ్ళో పువ్వుల్లాగా
తనలోనే నిను చూడవా నిను నువ్వే వదిలెయ్యవా
|ఆమె|
అలుపెరుగని సయ్యాటలో
గెలుపడగని కయ్యాలలో
|అతడు|
సమయం ఏమైందో ఏ మాత్రం గమనించరే
చాల్లే అనిపించని ఆశలు పెంచిందెవ్వరే
|ఆమె|
ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే…ఎవ్వరే
||ముందుగానే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)