చంద్రలేఖ: మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి

Posted by admin on 19th May 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Chandra Lekha
Song Singers
   Rajesh,
   Suneetha
Music Director
   Sandeep Chowta
Year Released
   1998
Actors
   Nagarjuna,
   Ramya Krishna,
   Isha Koppikar
Director
   Krishna Vamsi
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
     A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి
|ఆమె|
       అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి
|అతడు|
       తీగ మల్లి నాగై ఊగాలి
|ఆమె|
       వేగే ఒళ్లే అలలై పొంగాలి
|అతడు|
       మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి
|ఆమె|
       వేగే ఒళ్లో నాగై ఆడాలి
.
||చ|| |ఆమె|
       మదన మధురవళి మదిని మృదు మురళి
       పదును గాయాలు చేసే
|అతడు|
       మధురిమల కడలి అధరముల కదిలి
       పడుచు గేయాలు రాసే
|ఆమె|
       అందుకో కౌగిలి…
|అతడు|
       కందిపో కోమలి…
|ఆమె|
       మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి
|అతడు|
       వేగే ఒళ్లే అలలై పొంగాలి
.
||చ|| |అతడు|
       చెలిమి కలగలిపి చిలిపి లిపి తెలిపి వలపు రేపావు నాలో
|ఆమె|
       ఉలిని ఉసిగొలపి శిలల కల కదిపి కళలు లేపావు నాలో
|అతడు|
       ఆడుకో నాగినీ…
|ఆమె|
       ఆదుకో ఆశనీ….
|అతడు|
       మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి
|ఆమె|
       అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి
|అతడు|
       లాలి..లాలి పాడే జాబిలి…
|ఆమె|
       జ్వాలే మారి…జంటే కోరాలి
|ఇద్దరు|
      మొగలి పొదలు కదిలి సెగలు వదిలి…రరరార..రా…ర
.
.
               (Contributed by Nagarjuna)

Highlights


…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)