యువసేన: మల్లీశ్వరివే మధురాశల మంజరివే

Posted by admin on 19th May 2010 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Yuvasena
Song Singers
   Jassie Gift
Music Director
   Jassie Gift
Year Released
   2004
Actors
   Bharat,
   Gopika,
   Sashank
Director
   Jaya Raj
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
    తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
    వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా!

Song Lyrics

||ప|| |అతడు|
       మల్లీశ్వరివే మధురాశల మంజరివే
       మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
       తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
       వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
       చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో
       పోలికలో పసి బాలికవే చురకత్తుల చూపులున్నా
                             ||మల్లీశ్వరివే||
.
||చ|| |అతడు|
       నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో
       వేవేల తారకలే జలకమాడుతున్నవో
       నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
       సింగారి చెంపలో కెంజాయి సొంపులో
       వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
       నిదరలో ఉదయం ఎదురయే సమయం
       ఎదకి ఇంద్రజాలమేదో చూపుతోందే సోయగమా
                             ||మల్లీశ్వరివే||
.
||చ|| |అతడు|
       కొల్లేటి సరసులో తుళ్లేటి చేపలై
       రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
       నా కొంగజపము చూసి ఉలికిపడుతు ఉన్నవే
       ఎన్నేసి మెలికలో ఎర వేసి నన్నిలా
       ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే
       వదలదే హృదయం కదలదే నిమిషం
       చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా
                             ||మల్లీశ్వరివే||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)