కూలీ నెం.1: కొత్తకొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది

Posted by admin on 4th June 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Coolie No.1
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Venkatesh,
   Tabu
Director
   K. Raghavendra Rao
Producer
   D. Suresh Babu

Context

Song Context:
    A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       కొత్తకొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది
       కోటి తారలే పూలయేరులై
       కోటి తారలే పూలయేరులై నేల చేరగానే
                                 ||కొత్తకొత్తగా||
.
||చ|| |అతడు|
       నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయే కనకాంబరం
|ఆమె|
       నా చెంప సంపెంగలో కెంపు రంగాయే తొలి సంబరం
|అతడు|
       ఎన్ని పొంగులో కుమారి కొంగులో
|ఆమె|
       ఎన్ని రంగులో సుమాల వాగులో || ఎన్ని పొంగులో||
|అతడు|
       ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా
|ఆమె|
       జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా
                                        ||కొత్తకొత్తగా||
.
||చ|| |ఆమె|
       నీ నవ్వు ముద్దాడితే మల్లెపూవాయే నా యవ్వనం
|అతడు|
       నాజూకు మందారమే ముళ్ల రోజాగా మారే క్షణం
|ఆమె|
       మొగలి పరిమళం మొగాడి కౌగిలి
|అతడు|
       మగువ పరవశం సుఖాల లోగిలి || మొగలి పరిమళం ||
|ఆమె|
       కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
|అతడు|
       తీగమల్లెకి నరాల పందిరి అందించుకోగా
                                      || కొత్తకొత్తగా ||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)