|
Context
Song Context:
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లో echoలే మనమెట్టా ఉన్నామంటే
(A love song) |
Song Lyrics
||ప|| |అతడు|
బలపం పట్టి భామ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్లో ఆహా ఓహో పాడుకుంటా
అం అః అంటా అమ్మడు కమ్మహా ఉండేటప్పుడూ
బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో
|ఆమె|
సరసం ఇంక ఎక్కువైతే ఛాఛా ఛీఛీ తప్పదయ్యో
అపుడే ఇట్టా ప్రేమ బళ్లో ఐతే గియ్తే ఎందుకయ్యో
అచ్చులే అయ్యాయిప్పుడు హల్లుల్లో హల్లో ఎప్పుడు
.
||చ|| |అతడు|
ఎట్టాగుందే పాపా తొలిచూపే చుట్టుకుంటే
ఏదో కొత్త ఊపే ఎటు వైపో నెట్టేస్తుంటే
|ఆమె|
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది
|అతడు|
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా
|ఆమె|
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన
|అతడు|
కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా
|| సరసం ఇంక ||
.
||చ|| |ఆమె|
తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
|అతడు|
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లో echoలే మనమెట్టా ఉన్నామంటే
|ఆమె|
అడవంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
|అతడు|
ఎవరెవరో అత్తా మామా వరసెట్టా తెలిసేనే
|ఆమె|
అందాకా ఆ మర్రి అత్తమ్మ ఈ మద్ది మామనుకో
|| బలపం పట్టి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Perhaps one of the two most popular & trend-setting songs, since the early days, from Sirivennela’s pen along with శివ: బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా !
…………………………………………………………………………………………….
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
June 18th, 2010 at 11:29 pm
nice one
June 18th, 2010 at 11:32 pm
sirivenela used an english word in the song echo ui came to knew it today enjoyed it