|
Context
Song Context:
|ఆమె|
ఆరారు కాలల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా!
|అతడు|
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా!
|
Song Lyrics
||ప|| |ఇద్దరు|
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల దీపికవై ||మనసా||
మంచు తెరలు తెరుచుకొని మంచి తరుణం తెలుసుకొని
నవ్వులే పువ్వులై విరియగా
కోరస్:
తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా
నిన్ను జన్మంతా వెంటుండే రంగేళి పూలకొమ్మా
||మనసా||
.
చరణం: ఆమె:
నాలో కులుకుల కులుకులు రేపి లోలో తెలియని తలపులు రేపి
విరిసే వలపులు వెలుగును చూపి లాగే రాగమిది
అతడు:
నీలో మమతల మధువును చూసి నాలో తరగని తహ తహ దూకి
నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆమె:
ఆరారు కాలల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
అతడు:
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా
ఆమె:
మరి తయ్యారయ్యే వున్నా ఒయ్యారంగా
సైయ్యంటూ ఒళ్ళోకి వాలంగా
అతడు:
దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా
చిన్నారి వన్నెల్ని యేలంగా
ఆమె:
ప్రతిక్షణం పరవశం కలగక
అతడు: ||మనసా||
కోరస్:
హాయ్ రబ్బా హాయ్ రబ్బా హాయ్ హాయ్ హాయ్ ||2||
ఇలా ఇరువురు హాయిగా హాయ్ హాయ్ హాయ్
.
చరణం: అతడు:
ఆడే మెరుపుల మెలికల జాణా పాడే జిలిబిలి పలుకుల మైనా
రానీ తొలకరి చినుకుల లోన తుళ్ళే తిల్లనా
ఆమె:
వేగే తనువుల తపనలపైన వాలే చిరుచిరుచెమటల వాన
మీటే చిలిపిగ నడుమున వీణ చిందేటి తాళానా
.
అతడు:
బంగారు శృంగారు భావాలకు పొంగాడు ప్రాయన్ని కీర్తించనా
ఆమె:
అందాల మందార హారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా
అతడు:
ఇక వెయ్యేళైనా నిను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
ఆమె:
నువ్వు వెళ్ళాలన్నా ఇక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
అతడు:
కాలమే కదలక నిలువగా
ఆమె:||మనసా||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)