|
Song (happy times) Lyrics
Context:
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా గాలమ్మా:
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరి!
.
పల్లవి:
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా
గాలమ్మా కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం… సంగమం..
||నేలమ్మా||
.
చరణం:
అవని అందము కుదురు లేనిది
ఏడాదికొక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగ వెల్లువా
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యారి వంపులు నీ ఒంటికున్నవా
||నేలమ్మా||
.
చరణం:
కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువు తెల్లబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో అంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా
||నేలమ్మా||
.
.
(Contributed by Prabha) |
Song (Tough times) Lyrics
Context:
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా గాలమ్మా:
వరమ్మా కారణం మీరంతా సాక్షులుగా ఒక్కటైన దాంపత్యం భగ్గుమంది?
.
పల్లవి:
నేలమ్మా నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా
గాలమ్మా ఎవరమ్మా కారణం
మీరంతా సాక్షులుగా ఒక్కటైన దాంపత్యం
భగ్గుమంది ఎవరు దీని కారణం
||నేలమ్మా||
.
చరణం:
పూటపూటకీ అగ్నిపరీక్షా
ముగించు ఇకనైనా ఓ నిప్పమ్మా
ఇన్నినాళ్ళ ఈ తరుణి ఓర్పునీ
ఒళ్ళోన సేదతీర్చు ఓ నేలమ్మా
గంగవెల్లువా కౌగిలించుకో
పొంగుతున్న ఈ కన్నీరు తీసుకో
ఇల్లాళ్ళ ఘోషవై ఇల్లిల్లు ముంచిపో
||నేలమ్మా||
.
చరణం:
చోటు ఉన్నదా ఆకాశమా
ఈ గుండె శూన్యమంత నింపడానికి
శ్వాస తీసుకో చిరుగాలమ్మా
తుఫానుగాలిగ చెలరేగడానికి
అబలవై ఇలా అణిగి ఉండక
ఆదిశక్తివై అవతరించగా
ఇంకెన్ని ఉసురులు కావాలి చెప్పమ్మా
||నేలమ్మా||
.
.
(Contributed by Prabha) |
Highlights (Both)
Yet another double header masterpiece - the same పల్లవి in two different contexts! Or is it same concepts (పంచభూతాలు) in two different contexts? Awesome!
Sirivennela garu doesn’t miss these opportuinities Seriously!
.
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
In the first one:
చెలియ తనువులో వేడి తాకితే - చలికి వణకవా సూర్యబింబమా? Unbelievable!
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా? Huh! it is not over yet!
.
where as in the second one:
అబలవై ఇలా అణిగి ఉండక, ఆదిశక్తివై అవతరించగా
ఇంకెన్ని ఉసురులు కావాలి చెప్పమ్మా
.
[Also refer to Pages 252-253 in సిరివెన్నెల తరంగాలు]
.
We are fortunate, Sir!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)